బీజేపీతో మా పొత్తు అనంతరం వైసీపీ మత రాజకీయాలకు తెరలేపింది: చంద్రబాబు

  • చంద్రబాబును కలిసిన మైనారిటీ సమితి ప్రతినిధులు, ముస్లిం నేతలు
  • ముస్లింలకు మేలు చేసిందీ, చేసేదీ టీడీపీయేనని చంద్రబాబు వెల్లడి
  • అన్ని అస్త్రాలు పోయి జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డాడని విమర్శలు 
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. 

అన్ని అస్త్రాలు పోయి జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డాడని విమర్శించారు. జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పొత్తుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తాపడ్డారని వ్యాఖ్యానించారు. బీజేపీతో మా పొత్తు అనంతరం వైసీపీ  మత రాజకీయానికి తెరలేపిందని మండిపడ్డారు. పొత్తు వల్ల మైనారిటీలకు నష్టం కలుగుతుందన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లిం సంఘాల నేతలు వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని చంద్రబాబు కోరారు.


More Telugu News