మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు
- పొత్తులో భాగంగా ఈసారి 144 సీట్లలో పోటీ చేస్తున్న టీడీపీ
- ఇప్పటివరకు 128 మంది అభ్యర్థుల ప్రకటన
- మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటివరకు 128 మంది అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించారు. పొత్తులో భాగంగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
ఈ నేపథ్యంలో, పెండింగ్ లో ఉన్న 16 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అనంతరం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13న ఒకే రోజున జరగనున్నాయి. పోలింగ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో పలు చోట్ల జరిగే ఎన్నికల సభలకు ప్రధాని మోదీ హాజరవుతారని తెలుస్తోంది.