అదానీ గ్రూప్‌ కంపెనీకి సుప్రీంకోర్టు ఝ‌ల‌క్‌.. రూ.50వేల జ‌రిమానా!

  • ఎల్‌పీఎస్‌ డిమాండ్‌తో అదానీ ప‌వ‌ర్ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించ‌డానికి న్యాయ‌స్థానం నిరాక‌ర‌ణ‌
  • జ‌స్టిస్ అనిరుద్ధ బోస్‌, జ‌స్టిస్ సంజ‌య్ కుమార్‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ అదానీ కంపెనీకి మొట్టికాయ‌
  • రాజ‌స్థాన్ రాష్ట్ర డిస్కామ్ నుంచి ఎల్‌పీఎస్‌గా రూ.1,300 కోట్ల‌కు పైగా డిమాండ్ చేసిన అదానీ ప‌వ‌ర్‌
గౌత‌మ్ అదానీ గ్రూప్‌ కంపెనీకి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. లేట్ పేమెంట్ స‌ర్‌చార్జ్ (ఎల్‌పీఎస్‌) డిమాండ్‌తో అదానీ ప‌వ‌ర్ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించ‌డానికి న్యాయ‌స్థానం సోమ‌వారం నిరాక‌రించింది. అలాగే అదానీ కంపెనీకి రూ.50వేల జ‌రిమానా కూడా వేసింది. 

జ‌స్టిస్ అనిరుద్ధ బోస్‌, జ‌స్టిస్ సంజ‌య్ కుమార్‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ప‌వ‌ర్‌కు మొట్టికాయ వేస్తూ.. "ఎల్‌పీఎస్ కోసం వేర్వేరు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేయ‌డం అనేది అదానీ ప‌వ‌ర్ అనుస‌రించిన‌ స‌రైన చ‌ట్ట‌ప‌ర‌మైన మార్గం కాదు. సుప్రీంకోర్టు లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి రూ.50వేలు చెల్లించి ద‌ర‌ఖాస్తు కొట్టివేస్తాం. రాష్ట్ర డిస్కామ్ నుంచి అదానీ ప‌వ‌ర్.. ఎల్‌పీఎస్‌ రూపంలో రూ.1,300 కోట్ల‌కు పైగా డిమాండ్ చేసింది. 

 జైపూర్ విద్యుత్ విత్ర‌న్ నిగ‌మ్ లిమిటెడ్ అనేది రాజ‌స్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ. అదానీ ప‌వ‌ర్ రాజ‌స్థాన్ లిమిటెడ్ (ఏపీఆర్ఎల్‌) ద‌ర‌ఖాస్తు ద్వారా జైపూర్ విద్యుత్ విత్ర‌న్ నిగ‌మ్ లిమిటెడ్ నుంచి రూ.1376.35 కోట్ల అద‌న‌పు చెల్లింపున‌కు డిమాండ్ చేసింది. జ‌న‌వ‌రి 28న రాజ‌స్థాన్ డిస్కామ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఎల్‌) ప్ర‌కారం, ఆగ‌స్టు 2020లో తీసుకున్న నిర్ణ‌యం అనేది చ‌ట్టంలో మార్పు, బేరింగ్ కాస్ట్‌ ప‌రిహారంపై ఆధార‌ప‌డి ఉంది" అని డివిజ‌న్ బెంచ్ వాదించింది.


More Telugu News