అమరావతిని నాశనం చేశారు.. ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం: నారా లోకేశ్
- రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అందరం కలిసి పని చేద్దామన్న లోకేశ్
- ప్రజాగళం సభ విజయవంతమయిందని వ్యాఖ్య
- మంగళగిరిలో స్వర్ణకారుల కోసం సెజ్ తీసుకొస్తామన్న లోకేశ్
జగన్ సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతిని నాశనం చేశారని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ అపార్ట్ మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ తీసుకొస్తామని చెప్పారు. స్థానికులకే ఉద్యోగాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసికట్టుగా విజయం సాధిద్దామని చెప్పారు. చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమయిందని... సభకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. నిన్నటి సభతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందని చెప్పారు.