డబ్ల్యూపీఎల్ ఫైనల్: ఢిల్లీ క్యాపిటల్స్ ను కుప్పకూల్చిన ఆర్సీబీ అమ్మాయిలు

  • నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. 

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిల జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్ తో ఢిల్లీ క్యాపిటల్స్ విలవిల్లాడింది. శ్రేయాంక 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సోఫీ మోలినాక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లతో సత్తా చాటారు. 

ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు 7.1 ఓవర్లలో 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కానీ, తొలి వికెట్ రూపంలో షెఫాలీ అవుటయ్యాక సీన్ మారిపోయింది. ఢిల్లీ జట్టు 49 పరుగుల వ్యవధిలో 10 వికెట్లను చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు.


More Telugu News