పడిపోయిన ఫ్లిప్ కార్ట్ విలువ!

  • రెండేళ్ల కిందట ఫ్లిప్ కార్ట్  విలువ రూ.3.3 లక్షల కోట్లు
  • ఈ ఏడాది జనవరి నాటికి రూ.41 వేల కోట్ల పతనం
  • ఫోన్ పే విడిపోవడమే కారణం!
అమెరికా దిగ్గజ వ్యాపార సంస్థ వాల్ మార్ట్ చేతుల్లోకి వెళ్లిన ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ విలువ బాగా పడిపోయింది. 2022 జనవరిలో ఫ్లిప్ కార్ట్ విలువ రూ.3.3 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది జనవరి నాటికి ఆ విలువ రూ.2.9 లక్షల కోట్లకు పతనమైంది. మొత్తమ్మీద ఫ్లిప్ కార్ట్ ఈ రెండేళ్లలో రూ.41 వేల కోట్ల నష్టం చవిచూసినట్టు అర్థమవుతోంది. దీనికంతటికీ కారణం ఫోన్ పే... వాల్ మార్ట్ నుంచి విడిపోవడమేనని తెలుస్తోంది. 

2016లో ఫోన్ పే సంస్థను ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఇవి రెండు వాల్ మార్ట్ అధీనంలోకి వెళ్లాయి. అయితే, 2022లో ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్ విడిపోయాయి. ఈ పరిణామం ఫ్లిప్ కార్ట్ విలువపై ప్రభావం చూపినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. 

2021లో ఫ్లిప్ కార్ట్  విలువను మదింపు చేయగా, అప్పుడు ఫోన్ పేను కూడా కలుపుకుని విలువ లెక్కగట్టారు.


More Telugu News