పదో క్లాస్ రిజల్ట్స్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన నాని
- తాను థర్డ్ క్లాస్ లో పాస్ అవుతానని ఇంట్లో వాళ్లు ఫిక్స్ అయిపోయారన్న నాని
- థర్డ్ క్లాస్ లో తన నెంబర్ లేకపోవడంతో ఫెయిల్ అయ్యానని అనుకున్నారని వెల్లడి
- తాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని తన స్నేహితులు చెప్పారన్న నాని
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని ఆ తర్వాత యాక్టర్ గా మారి, అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కింది స్థాయి నుంచి పైకి ఎదగడానికి నాని పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
తాను పదో తరగతిలో థర్డ్ క్లాస్ లో పాసవుతానని అందరూ ఫుల్ క్లారిటీతో ఉన్నారని... ఆరోజు రిజల్ట్ వచ్చే రోజని... అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి న్యూస్ పేపర్లో రిజల్ట్స్ వచ్చేవని చెప్పాడు. తామంతా థర్డ్ క్లాస్ లిస్ట్ లోనే రిజల్ట్స్ వెతకడం ప్రారంభించామని... అయితే, అక్కడ తన నెంబర్ కనిపించకపోవడంతో తాను ఫెయిల్ అయ్యానని అనుకున్నారని తెలిపాడు. కానీ, తన మీద ఎంతో నమ్మకం ఉన్న అమ్మ సెకండ్ క్లాస్ లో చూద్దామని అక్కడ చూసినా తన నెంబర్ కనిపించలేదని, దీంతో వీడు ఫెయిల్ అయ్యాడని ఆమె కూడా ఫిక్స్ అయ్యారని చెప్పాడు. ఫస్ట్ క్లాస్ లో రిజల్ట్స్ వెతకలేదని తెలిపాడు. కానీ, ఇంతలోనే తన ఫ్రెండ్స్ వచ్చి నాని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని చెప్పడంతో... గబగబా వెళ్లి ఫస్ట్ క్లాస్ లో వెతకడంతో తన రిజల్ట్ కనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత ఏ ఎగ్జామ్ కూడా ఒకేసారి పాస్ అయింది లేదని సరదాగా చెప్పాడు.