స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి పెన్నీ

  • ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్న పెన్నీ వాంగ్
  • గత 20 ఏళ్లుగా సోఫియా అల్లౌకేతో సహజీవనం
  • తాజాగా అడిలైడ్ నగరంలో వివాహం
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన భాగస్వామి సోఫియా అల్లౌకేను వివాహం చేసుకున్నారు. ఇది స్వలింగ వివాహం. పెన్నీ వాంగ్ ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్నారు. ఆస్ట్రేలియా క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న తొలి ఆసియా సంతతి మహిళగా పెన్నీ వాంగ్ కు గుర్తింపు ఉంది. 

గత 20 ఏళ్లుగా సోఫియాతో పెన్నీ వాంగ్ సహజీవనం చేస్తున్నారు. తాజాగా అడిలైడ్ నగరంలో పెళ్లి చేసుకున్నారు. తన సహచరి సోఫియాతో పెళ్లి విషయాన్ని పెన్నీ వాంగ్ స్వయంగా వెల్లడించారు. సన్నిహితులు, మా సామాజిక వర్గీయులతో కలిసి ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనందదాయకం అని వాంగ్ వెల్లడించారు. 

ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతి ఉంది. 2017 నుంచి ఇక్కడ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.


More Telugu News