తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

  • తెలంగాణలో రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు
  • ఐదు నిమిషాల నిబంధన ఎత్తివేత
  • ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టికెట్ నంబరు రాయాల్సిందేనని ఆదేశం
పదో తరగతి పరీక్షల్లో ప్రశ్న పత్రాలు తారుమారు కాకుండా, కాపీయింగ్‌కు వీలులేకుండా ఉండేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్లు రాయాలని సూచించింది. రేపటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు, ఇప్పటి వరకు అమలులో ఉన్న 5 నిమిషాల నిబంధనను ఎత్తివేసింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది. రేపు ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి.


More Telugu News