రెస్టారెంట్‌లో దారుణ హత్య.. తలపై కాల్చి, ఆపై కత్తితో గొంతు కోసి దారుణం
- పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఘటన
- రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపిన దుండగులు
- పారిపోతున్న బాధితుడిని పట్టుకుని కత్తితో గొంతు కోసి దారుణం
పూణెలో నిన్న సాయంత్రం అందరూ చూస్తుండగా దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కొందరు దుండగులు అనంతరం పట్టుకుని గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. బాధితుడిని 34 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. రెండు గ్యాంగుల మధ్య ముఠా శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతున్నాయి. ధాన్వే, మరో ముగ్గురు రెస్టారెంట్‌లోని టేబుళ్ల వద్ద కూర్చున్నారు. సమీపంలోని మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్‌లోకి వచ్చారు. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఆ వెంటనే తుపాకులు తీసి ఫోన్‌లో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. దీంతో భయపడిన ధాన్వే, మిగతా ముగ్గురు అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
ఆ వెంటనే రెస్టారెంట్‌లోకి ఆరుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకొని కత్తులతో దాడిచేసి గొంతు కోసి హత్యచేశారు. టేబుల్ వద్ద భోజనం చేస్తున్న కుటుంబం ఈ ఘటనతో భయపడిపోయి పరుగులుపెట్టడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు గ్యాంగుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.