ఎంపీగా పోటీచేసే ఉద్దేశం లేదు.. వదంతులపై దానం నాగం
- కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టీకరణ
- బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానన్న దానం నాగేందర్
తాను కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీచేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. అవన్నీ వదంతులేనని కొట్టిపడేశారు. కాంగ్రెస్‌లో చేరికపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తనకు ఎంపీగా పోటీచేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.
ఖైరదాబాద్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని వివరించారు. బీఆర్ఎస్‌ను వీడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం దానం కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, రేపే (18న) ముహూర్తమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారమంతా ఉత్తదేనని చెబుతూ దానం ఈ వార్తలకు చెక్ పెట్టారు.