పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చిన కారులో కిమ్ షికార్లు
- గతేడాది సెప్టెంబరులో రష్యాలో పర్యటించిన ఉత్తర కొరియా అధినేత
- విలాసవంతమైన ఆరస్ లిమోసిన్ కారును కానుకగా ఇచ్చిన పుతిన్
- మరింత బలపడుతున్న రష్యా, ఉత్తర కొరియా మైత్రి
ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన రష్యా... అణుశక్తిగా ఎదిగి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్న ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం ఏర్పడడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఈ రెండు దేశాలకు ఉమ్మడి ప్రబల శత్రువు అమెరికా. అమెరికాతో వైరం ముదిరేకొద్దీ రష్యా, ఉత్తర కొరియా మధ్య మైత్రి కూడా అంతకంతకు బలపడుతోంది. అందుకు నిదర్శనంగా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కు ఓ ఖరీదైన కారును బహూకరించారు. ఇప్పుడా కారులో కిమ్ దర్జాగా షికార్లు కొడుతున్నారు.
గతేడాది సెప్టెంబరులో కిమ్ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పటిష్ఠమైన సైనిక సంబంధాల కోసం ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా పుతిన్ రష్యా తయారీ ఆరస్ సెనాట్ ఫుల్ సైజ్ లగ్జరీ లిమోసిన్ కారును కిమ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. నిన్న ఈ కారులో షికార్లు కొడుతూ కిమ్ పబ్లిగ్గా దర్శనమిచ్చారు.