సీఎం జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు: కేశినేని నాని
- మరోసారి విజయవాడ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారన్న ఎంపీ
- వైసీపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై స్పందించిన కేశినేని నాని
- సీఎం జగన్‌తో దిగిన ఫొటోని షేర్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఎంపీ
వైఎస్సార్‌సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని స్పందించారు. వైసీపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం జగన్‌కు ఆయన హృదయపూర్వ ధన్యవాదాలు తెలిపారు. మరోసారి విజయవాడ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సీఎం జగన్‌తో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కేశినేని నాని గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమంటూ టీడీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంలో ఆయన పార్టీ మారారు. అధికార వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలావుంచితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 24 ఎంపీ స్థానాలకు నేడు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.