వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలో 34 మంది ఇంజనీర్లు
- 17 మంది వైద్యులు ఉన్నట్టు వెల్లడించిన అధికార పార్టీ
- 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులేనని వెల్లడి
- ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించిన వైసీపీ
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేడు (శనివారం) ప్రకటించిన జాబితాలో అత్యధికులు విద్యావంతులేనని ఆ పార్టీ వెల్లడించింది. టికెట్ల కేటాయింపులో విద్యావంతులకు అధినేత జగన్ అగ్రపీఠం ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అభ్యర్థుల విద్యార్హతలను షేర్ చేసింది. వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో 175 మందిలో 131 మంది చదువుకున్నవారేనని తెలిపింది.
అభ్యర్థుల్లో అత్యధికంగా 34 మంది ఇంజనీర్లు ఉన్నారని వైసీపీ తెలిపింది. 17 మంది వైద్యులు, 15 మంది న్యాయవాదులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒకరు జర్నలిస్ట్ ఉన్నారని ఆ పార్టీ వివరించింది.