కాసేపట్లో ఇడుపులపాయకు జగన్.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం

  • వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న జగన్
  • ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో ఇడుపులపాయకు బయల్దేరుతున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఎంతో మంది అభ్యర్థులను జగన్ ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రకటించిన అభ్యర్థులను తొలగించి, కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే ఈ మధ్యాహ్నం ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్. వీరే ఎన్నికల్లో పోటీ చేస్తారు. వైసీపీ జాబితాను జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేశ్ ప్రకటిస్తారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. అన్ని వర్గాలకు అవకాశం ఉండేలా జాబితాను తయారు చేసినట్టు చెపుతున్నారు. మరోవైపు ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News