కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన

  • హైదరాబాద్ లో గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమం
  • కూతురుతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఉపాసన
  • క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డ వైనం  
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించారు. దేశ వ్యాప్తంగా చరణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన భార్య ఉపాసన కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూనే, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె విస్తృతంగా పాల్గొంటుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంటుంటారు. హెల్త్ పరమైన టిప్స్ ను ఇస్తుంటారు.

తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిశారు. తన కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి ఉపాసన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు.  

ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన కుమార్తె క్లీంకారతో కలిసి కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామ్లేశ్ దాజీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.


More Telugu News