కవిత అరెస్ట్ నేపథ్యంలో... బీజేపీని ఎండగడుతూ చంద్రబాబు చేసిన పాత ట్వీట్ ను తిరగదోడిన కేటీఆర్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్
- 2019 ఎన్నికల నాటి చంద్రబాబు ట్వీట్ ను రీపోస్ట్ చేసిన కేటీఆర్
- ఎన్నికల ముందు ఇలాంటి దాడులేంటని ఆ ట్వీట్ లో చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబుకు, బీజేపీకి మధ్య 2019 ఎన్నికల వేళ ఎంతటి మనస్పర్ధలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబుకు మిత్రపక్షం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్... చంద్రబాబు గతంలో చేసిన ఓ పాత ట్వీట్ ను వెలికితీశారు. తన సోదరి కవితను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు.
ఇంతకీ ఆ ట్వీట్ లో చంద్రబాబు ఏమని పేర్కొన్నారంటే... "2019 సాధారణ ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను వేధించడం తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రతీకారానికి ఒడిగడుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ దాడులు ఈ సమయంలోనే జరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు దాడులు చేస్తున్నారు?" అంటూ చంద్రబాబు ఆ ట్వీట్ లో ప్రశ్నించారు.
చంద్రబాబు 2019 ఫిబ్రవరి 6న ఆ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ ను ఇవాళ కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ చక్కగా వాడుకున్నారు. "ఈ కింది ట్వీట్ లో చంద్రబాబు గారు భలే చెప్పారు... ఇంత కరెక్ట్ గా ఎవరూ చెప్పలేరేమో!" అంటూ తన రాజకీయ చతురత ఉపయోగించారు.