తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే: కవిత అరెస్ట్‌పై రాజాసింగ్ వ్యాఖ్య
- తప్పు చేస్తే ఈ రోజు కూతురు.. రేపు సోదరుడు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళతాడని వ్యాఖ్య
- నోటీసులు లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అడగడాన్ని ప్రశ్నించిన రాజాసింగ్
- గతంలో తనను కూడా నోటీసులు లేకుండానే అరెస్ట్ చేశారని గుర్తు చేసిన రాజాసింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కేటీఆర్, కేసీఆర్‌లను ఉద్దేశించి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఎప్పటికైనా అరెస్ట్ కావాల్సిందే అన్నారు. ఎందుకంటే ఇది మోదీ పాలన... మోదీ పాలనలో అవినీతిపరులను వదిలేది లేదన్నారు. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని, ఆ తర్వాత కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆమె విచారణకు వెళ్లలేదన్నారు. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం గుర్తు చేశారు. ఈ రోజు కాకున్నా రేపైనా ఆమె అరెస్ట్ కావాల్సిందేనని... ఈ రోజు అరెస్ట్ అయ్యారన్నారు.
నోటీసులు లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారని... కానీ తనను కూడా ఎలాంటి నోటీసులు లేకుండా గత బీఆర్ఎస్ హయాంలో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అన్యాయంగా తనపై పీడీ యాక్ట్ పెట్టి 77 రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని... ఆ రోజు తన టైమ్ బాగాలేదు.. ఈ రోజు మీ టైమ్ బాగాలేదని గుర్తుంచుకోవాలన్నారు. కానీ ఆ రోజు తాను ఎలాంటి తప్పు చేయలేదని... ఇప్పుడు మీ సోదరి మాత్రం అక్రమాలకు పాల్పడిందన్నారు.