అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులకు కవిత పిలుపు

  • ఇలాంటి కక్ష సాధింపు చర్యలను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొందామన్న కవిత
  • మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని వెల్లడి
  • ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత
  • పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలని వ్యాఖ్య
ఇలాంటి కక్ష సాధింపు చర్యలను చట్టంపై నమ్మకంతో ఎదుర్కొందామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. 

కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడా అడ్డుకోరని... ఎవరూ ఆపరని... మీరు స్వేచ్ఛగా తీసుకువెళ్లవచ్చునని బీఆర్ఎస్ నాయకులు ఈడీ అధికారులకు తెలిపారు. కాగా, సాయంత్రం తనను అరెస్ట్ చేయడంపై ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తారంటూ వారిని అడిగారని తెలుస్తోంది.


More Telugu News