అందుకే అరెస్ట్ చేశాం... కవిత అరెస్ట్‌పై భర్తకు సమాచారమిచ్చిన ఈడీ

  • మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడి
  • సాయంత్రం 5.20 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి
  • 14 పేజీల అరెస్ట్ సమాచారాన్ని భర్తకు ఇచ్చామని వెల్లడించిన ఈడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5.20 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ అరెస్ట్‌కు సంబంధించి కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం అందించినట్లు పేర్కొంది. 14 పేజీల అరెస్ట్ సమాచారాన్ని భర్తకు ఇచ్చామని వెల్లడించింది.

ఈ మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో ఈడీ... కవిత భర్తకు సమాచారం ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలోనే అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. కాగా కవితను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే విచారించే అవకాశముంది.


More Telugu News