రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎంత జీతం తీసుకుంటారో తెలుసా...!
- ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
- పదవులకు తగ్గట్టే భారీ వేతనాలు, ఉచిత సౌకర్యాలు
- పదవి నుంచి తప్పుకున్నాక కూడా భారీగా పెన్షన్లు, సదుపాయాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి అనేవి అత్యున్నత పదవులు. వారి జీతభత్యాలు కూడా వారి పదవుల స్థాయికి తగ్గట్టే ఘనంగా ఉంటాయి. వీరి వేతనాలను కాలానుగుణంగా సవరిస్తుంటారు. వీరిలో రాష్ట్రపతికి అత్యధిక వేతనం లభిస్తుంది. వేతనమే కాదు, ఇతర భత్యాలు, సౌకర్యాలు కూడా భారీగానే లభిస్తాయి.
రాష్ట్రపతి...
రాష్ట్రపతి...
- భారత కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతం అందుకునేది రాష్ట్రపతి.
- రాష్ట్రపతి నెలకు రూ.5 లక్షల వేతనం అందుకుంటారు.
- ఆయనకు 340 గదులు ఉన్న రాష్ట్రపతిభవన్ లో బస కల్పిస్తారు.
- ప్రపంచంలో ఎక్కడికైనా సరే రాష్ట్రపతికి ఉచిత విమాన, రైలు ప్రయాణ సదుపాయాలు కల్పిస్తారు.
- ఉచిత నివాస సౌకర్యం, ఉచిత ఆరోగ్య సదుపాయం, ఆఫీసు ఖర్చుల కోసం ఏడాదికి రూ.1 లక్ష అందిస్తారు.
- రాష్ట్రపతి పదవీ విరమణ చేశాక నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ లభిస్తుంది.
- రిటైరయ్యాక పూర్తి ఫర్నిచర్ తో కూడిన బంగ్లాలో ఉచిత నివాసం. రెండు ల్యాండ్ లైన్లు, ఒక మొబైల్ ఫోన్ కూడా ఉచితం
- మాజీ రాష్ట్రపతి సేవల కోసం ఐదుగురు సిబ్బంది కేటాయింపు. వారి బాగోగుల కోసం ఏడాదికి రూ.60 వేల భత్యం.
- మాజీ రాష్ట్రపతితో పాటు ఒకరికి విమానంలో కానీ, రైలులో కానీ ఉచిత ప్రయాణం.
- ఉప రాష్ట్రపతికి నెలకు రూ.4 లక్షల జీతం చెల్లిస్తారు.
- జీతానికి అదనంగా రోజువారీ భత్యాలు.
- ఉచిత నివాసం, ఉచిత వైద్య సేవలు, ఉచిత విమాన ప్రయాణం, ఉచిత రైలు ప్రయాణం, ఉచితంగా ల్యాండ్ లైన్, ఉచితంగా మొబైల్ ఫోన్ సేవలు లభిస్తాయి.
- ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ అందిస్తారు.
- రాష్ట్రపతి గైర్హాజరీలో ఉప రాష్ట్రపతే ప్రథమ పౌరుడిగా సేవలు అందించిన సమయంలో రాష్ట్రపతి వేతనం, ఇతర ప్రయోజనాలు అందిస్తారు. రాష్ట్రపతికి లభించే అన్ని సదుపాయాలు ఉప రాష్ట్రపతికి లభిస్తాయి.
- ప్రధానమంత్రికి నెలకు రూ.1.66 లక్షల వేతనం ఇస్తారు. ఇందులో బేసిక్ పే రూ.50 వేలుగా ఉంది.
- అదనంగా... ప్రధానికి ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు, పార్లమెంటరీ భత్యం కింద రూ.45 వేలు చెల్లిస్తారు.
- వీటితో పాటు దినసరి భత్యం కింద ప్రధాని రోజుకు రూ.2 వేలు అందుకుంటారు.
- ఉచితంగా నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారు.
- ప్రధానమంత్రి రక్షణ బాధ్యతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పర్యవేక్షిస్తుంది.
- ప్రధాని తన ప్రయాణల కోసం ఏ ప్రభుత్వ వాహనం అయినా వినియోగించుకోవచ్చు. ఏ ప్రభుత్వ విమానంలో అయినా ప్రయాణం చేయవచ్చు.
- ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక... ఉచిత నివాస సదుపాయం కల్పిస్తారు. ఉచితంగా విద్యుత్, నీరు వంటి సదుపాయాలు అందిస్తారు.
- ప్రధాని పదవి నుంచి వైదొలిగాక ఐదేళ్ల పాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కల్పిస్తారు.