ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ హిందువులను విస్మరించింది: ధర్మపురి అరవింద్
- సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం
- నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరిమితమైందని విమర్శ
- 18న జగిత్యాలలో జరిగే మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులను విస్మరించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఈ నెల 18న జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరిమితమైందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కమిటీలలో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తుశుధ్ది లేదన్నారు. జగిత్యాల మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.