బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కావొచ్చునని అనుమానం వ్యక్తం చేసిన మంత్రి
  • మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా అరెస్ట్ చేయాల్సిందని వ్యాఖ్య
  • కవిత అరెస్టుతో లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాల అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కావొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా అరెస్ట్ చేయాల్సిందని వ్యాఖ్యానిచారు. కానీ ఇప్పుడు కవిత అరెస్టుతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

అంతకుముందు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు కవిత అరెస్ట్ గురించి మాట్లాడారని గుర్తు చేశారు. రేపే అరెస్ట్ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడారని... కానీ అప్పుడు ఏమీ జరగలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కొట్లాడుకుంటూ ఢిల్లీలో మాత్రం దోస్తులుగా ఉన్నారని విమర్శించారు.


More Telugu News