సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ ఇలాకాక మరెలా ఉంటుంది?: చంద్రబాబు
- బోర్డులో అక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
- ఏపీపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆవేదన
- నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్‌ను మెడపెట్టి గెంటేశారని ఆగ్రహం
- జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతం సవాంగ్‌ను నియమించారన్న చంద్రబాబు
సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏ సంస్థ అయినా ఎలా ఉంటుందో చెప్పేందుకు ఏపీపీఎస్సీ ఒక ఉదాహరణ అని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బోర్డులో చోటుచేసుకున్న అక్రమాలపై చంద్రబాబు ఈ ఉదయం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థుడైన చైర్మన్ లేకపోతే బోర్డు సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవేనని, ప్రజలకు సేవలు అందించాలని కొందరు గ్రూప్ పరీక్షలకు వస్తారని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో నిజాయతీ కలిగిన వ్యక్తులను చైర్మన్‌గా నియమించామని వివరించారు. ఇప్పుడేమో బోర్డు పునరావాస కేంద్రంగా మారిందని, ఉద్యోగాలను అమ్మేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్‌ను మెడపట్టి గెంటేశారని, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతం సవాంగ్‌ను నియమించారని చంద్రబాబు విమర్శించారు. సవాంగ్ తప్పుడు అఫిడవిట్లతో కోర్టుల్ని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం ఆరోపించారు.