వైఎస్ వివేకా సమాధి వద్ద సునీత నివాళి.. వర్ధంతి సభలో ప్రసంగించనున్న షర్మిల
- పులివెందులలోని ఘాట్ వద్ద సునీత, కుటుంబ సభ్యుల నివాళి
- కడపలోని జయరాజ్ గార్డెన్ లో వివేకా వర్ధంతి సభ
- సునీత, షర్మిల కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత నివాళి అర్పించారు. తన భర్త రాజశేఖరరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ కు ఆమె వెళ్లారు. సమాధిపై పూలమాల ఉంచి అంజలి ఘటించారు. క్రైస్తవ మతాచారాల ప్రకారం ప్రేయర్ చేశారు.
మరోవైపు, కడపలోని జయరాజ్ గార్డెన్ లో ఈరోజు వివేకా వర్ధంతి సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా భార్య సౌభాగ్యమ్మ, సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరు కానున్నారు. ఈ సభలో షర్మిల, సునీత కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. సునీత రాజకీయ భవితవ్యంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.