ఆ ఇల్లు కేసీఆర్‌కు బాగా సెంటిమెంట్.. అయినా ఇప్పుడు వేరే ఇంటికి మారకతప్పడం లేదట.. కారణం ఏమిటంటే..!
- ప్రస్తుతం నందినగర్‌లోని పాత ఇంట్లో ఉంటున్న కేసీఆర్
- పార్టీ నేతలు, కార్యకర్తల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ సమస్య
- కుందన్ బాగ్ గవర్నమెంట్ క్వార్టర్స్‌కి షిప్ట్ అవ్వాలనే యోచనలో మాజీ సీఏం
పదేళ్లు సీఏంగా పనిచేసిన కేసీఆర్‌కు ప్రస్తుతం ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలెస్ లాంటి ప్రగతి భవన్‌లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్‌లోని పాత ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇల్లు కేసీఆర్‌కు బాగా సెంటిమెంట్ కూడా. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది సరిపోవడం లేదు. రోజు వచ్చిపోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజారాహిల్స్‌లోని ఆయన ఉండే నందినగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇప్పటికే కొంతమంది కాలనీ వాసులు దీనిపై కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారట. దీంతో ఆ ఇంటిని పెద్దది చేయడం లేదా వేరేచోట ఇంకో పెద్ద ఇల్లు నిర్మించుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ మాత్రం అచ్చొచ్చిన ఆ సెంటిమెంట్ ఇల్లును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.
దాంతో నందినగర్‌లో ఉన్న ఆయన ఇంటికి అనుకుని ఉండే ఓ ఇల్లు అమ్మకానికి ఉండడంతో దాన్ని కొన్నారు. ఇప్పుడు ఆ రెండిళ్లను కలిపి ఒకే పెద్ద నివాసంగా నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఆ లోపు కేసీఆర్ తాత్కాలికంగా ఒకటి రెండేళ్ల పాటు మరోచోట నివాసం ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రోటోకాల్ ప్రకారం క్యాబినేట్ హోదా ఉంటుంది. దీనిలో భాగంగా ఆయనకు ఒక క్వార్టర్ని కూడా కేటాయించవచ్చు.
గతంలో ప్రగతిభవన్‌లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్న కుందన్ బాగ్ గవర్నమెంట్ క్వార్టర్స్‌కి షిప్ట్ అవ్వాలని భావిస్తున్నారు. రెండురోజుల క్రితం కుందన్‌బాగ్‌లో ఉన్న నాలుగు క్వార్టర్స్‌ని ఆయన పరిశీలించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి నివాసమున్న ఒక క్వార్టర్‌ను, స్పీకర్స్‌కి కేటాయించిన మరొక క్వార్టర్స్‌ని కూడా ఆయన పరిశీలించారు. వచ్చిపోయే కార్యకర్తలతో ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, చిన్నచిన్న సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలు ఉండేలా ఆయన ఇల్లు చూసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన కుందన్‌బాగ్‌లో ఉన్న క్వార్టర్స్‌కి మారే అవకాశం కనిపిస్తోంది.