రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో కొనసాగుతున్న పోలింగ్.. ఎందుకిలా?

  • రష్యాలో నేడు ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికలు
  • కేరళలోని రష్యా పౌరుల కోసం తిరువనంతపురంలో పోలింగ్ బూత్ ఏర్పాటు
  • ఇలా ఏర్పాటు చేయడం మూడోసారన్న రష్యా ఆనరరీ కాన్సుల్
  • పుతిన్‌కు ప్రత్యర్థులుగా బరిలోకి ముగ్గురు నేతలు
  • ఈ ఎన్నిల్లో గెలిస్తే 2030 వరకు అధికారంలో పుతిన్
రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేరళలో కొనసాగుతోంది. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. రష్యాలో నేడు ప్రారంభమైన ఎన్నికలు ఎల్లుండి వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రష్యా ఆనరరీ కాన్సులేట్ తిరువనంతపురంలో ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది.

రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం తిరువనంతపురంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా ఆనరరీ కాన్సుల్, తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీశ్ నాయర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు సహకరించినందుకు కేరళలోని రష్యన్ పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

రష్యాలో 11 టైమ్ జోన్లలో మూడు రోజులపాటు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పుతిన్‌కు ప్రత్యర్థులుగా  లిబర్ డెమొక్రటిక్ పార్టీ నుంచి లియోనిడ్ స్లట్‌స్కీ, న్యూ పీపుల్ పార్టీ నుంచి వ్లాడిస్లావ్ డవన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నికోలయ్ ఖరితోనోవ్ పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురు క్రెమ్లిన్ అనుకూల వాదులే. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు వీరు వ్యతిరేకం కాదు. ఈ ఎన్నికల్లో పుతిన్ విజయం సాధిస్తే ఆయన పాలన 2030 వరకు కొనసాగే అవకాశం ఉంది.

పుతిన్ తిరిగి ఎన్నికైతే అతని పాలనను కనీసం 2030 వరకు పొడిగించవచ్చు. 2020లో రాజ్యాంగ మార్పుల తరువాత, అతను మళ్లీ పోటీ చేయగలడు మరియు 2036 వరకు అధికారంలో ఉండగలడు. 2020లో రాజ్యాంగంలో మార్పుల నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆయన పోటీ చేసి 2036 వరకు అధికారంలో కొనసాగే వెసులుబాటు ఉంది.


More Telugu News