ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

  • కొన్నాళ్లుగా చమురు ధరలు సవరించని కేంద్రం
  • మరి కొన్ని వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు
  • లీటర్ పెట్రోల్ పై రూ.2... డీజిల్ పై రూ.2 తగ్గింపు
  • శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరల అమలు
దేశంలో చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే, మరి కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న దశలో, కేంద్రం నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.2, డీజిల్ పై రూ.2 తగ్గిస్తున్నట్టు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. తగ్గించిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయని తెలిపింది. 

కాగా, ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్  సంస్థలు ఇప్పటికే సమాచారం అందించాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఇకపై రూ.94.72... లీటర్ డీజిల్ 87.62కు లభించనున్నాయి.


More Telugu News