టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • డీఎస్సీ కంటే ముందే నిర్వహించుకునే విధంగా జీవో ఇచ్చిన ప్రజా ప్రభుత్వం
  • దీంతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు 
  • సాధ్యమైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం అభిప్రాయం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. సాధ్యమైనంత ఎక్కువమందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో ఇప్పటికే మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలు, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటోందని మరోసారి రుజువైందని ట్వీట్ చేసింది.


More Telugu News