ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 18 సీట్లు, 15 సీట్లు నష్టపోనున్న వైసీపీ: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి
- 2019లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ
- కూటమి కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీలకు సీట్లు భారీగా పెరుగుతాయన్న సర్వే
- వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించిన సర్వే
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 18 సీట్లు వచ్చే అవకాశముందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. అధికార వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని ఈ సర్వే విశ్లేషించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లలో గెలవగా, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్డీయే కూటమి 15 సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీయేకు కలిసి వచ్చిందని ఈ సర్వే పేర్కొంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ రాకపోవచ్చునని పేర్కొంది.
టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం ఓటు బ్యాంకు సాధించి 18 సీట్లు, వైసీపీ 41 శాతం ఓటు బ్యాంకుతో 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. ఇండియా కూటమికి 6 శాతం, ఇతరులకు 3 శాతం రావొచ్చునని పేర్కొంది. ఇక్కడ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు.