విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేఏ పాల్ పిటిషన్... హైకోర్టులో విచారణ
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివిధ వర్గాలు
- ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్
- తదుపరి విచారణ మార్చి 22కి వాయిదా
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? భూములు విక్రయిస్తే ఎన్ని ఎకరాలు విక్రయించారు? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు వివరాలు సమర్పించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీని ఆదేశించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. పిటిషన్ లో పేర్కొన్న మేరకు భూముల విక్రయ పత్రాలు కోర్టు ముందుంచాలని కేఏ పాల్ కు హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.