అణ్వాయుధాలు ఉపయోగిస్తామని పుతిన్ హెచ్చరించలేదు.. వివరణ ఇచ్చిన రష్యా
- పుతిన్ వ్యాఖ్యలను అమెరికా వక్రీకరించిందంటూ క్రెమ్లిన్ ప్రకటన
- పరిస్థితులు ఎదురైతే అణుయుద్ధానికి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని చెప్పారన్న క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్
- ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను వాడే ఉద్దేశంలేదని వివరణ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్‌కు అమెరికా సైన్యాన్ని పంపిస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామంటూ తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించలేదని రష్యా క్లారిటీ ఇచ్చింది. అణుయుద్ధం చేయడానికి రష్యా సాంకేతికంగా సంసిద్ధంగా ఉందని, ఉక్రెయిన్‌కు అమెరికా సైన్యాన్ని పంపిస్తే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయని పుతిన్ అన్నారని పేర్కొంది. అయితే తమ అధ్యక్షుడి వ్యాఖ్యలను అమెరికా దురుద్దేశపూర్వకంగా వక్రీకరించిందని పేర్కొంది.
ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానం ఇచ్చారని అన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన పరిస్థితులు వస్తే రష్యా సిద్ధాంతపరంగా వాడతామంటూ తమ అధ్యక్షుడు అన్నారని వివరించారు. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలనే ఆలోచన తమకు లేదని అదే ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పారని పెస్కోవ్ ప్రస్తావించారు.
కాగా ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా సైన్యాన్ని పంపిస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారంటూ బుధవారం వార్తా కథనాలు వెలువడ్డాయి. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రతినిధి కరీన్ జీన్ పియర్ స్పందించారు. రష్యా అధినేత పుతిన్ చెప్పదలచుకున్న అణు సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నామని విమర్శించారు. ఉక్రెయిన్ వివాదం అంశంలో రష్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. బాధ్యత లేకుండా అణ్వాధాయులను ఉపయోగిస్తున్నామంటూ బెదరిస్తున్నారని మండిపడ్డారు.