తెలంగాణలో బీజేపీ దూకుడు... 8 సీట్లు గెలిచే ఛాన్స్, కాంగ్రెస్‌కు 6 సీట్లు: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి

  • బీజేపీ తన లోక్ సభ సీట్లను గతంలో కంటే రెండింతలు పెంచుకునే అవకాశం
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆరు సీట్లకు పరిమితం
  • బీఆర్ఎస్ 7 సీట్లు కోల్పోయి రెండు చోట్ల గెలువవచ్చునన్న సర్వే
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ హవానే కొనసాగే అవకాశం ఉందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే విశ్లేషించింది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2, ఇతరులు (మజ్లిస్) 1 సీటు గెలుచుకునే అవకాశముందని ఈ సర్వే వెల్లడించింది.

బీఆర్ఎస్ పార్టీకి 27 శాతం, ఇండియా కూటమికి 34 శాతం, బీజేపీకి 28 శాతం, ఇతరులకు 11 శాతం ఓటింగ్ షేర్ రావొచ్చునని పేర్కొంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, మజ్లిస్ 1 సీటులో గెలిచింది. ఇప్పుడు బీజేపీ సీట్లు రెండింతలు పెరిగే అవకాశముందని వెల్లడింది. కాంగ్రెస్ మూడు సీట్లు పెంచుకుంటుందని, అదే సమయంలో బీఆర్ఎస్ తన ఏడు సీట్లను బీజేపీ, కాంగ్రెస్‌లకు పోగొట్టుకోనుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.

కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా బీజేపీ 25, ఇండియా కూటమి 3, అసోంలో 14 సీట్లకు 14 బీజేపీ, రాజస్థాన్‌లో 25 సీట్లకు 25 బీజేపీ, ఉత్తరాఖండ్‌లో 5 సీట్లకు ఐదు బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది.


More Telugu News