ఇది అన్యాయం... ఇక పిఠాపురం ప్రజలే తేల్చాలి: ఎస్వీఎస్ఎన్ వర్మ
- ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు
- పిఠాపురం టికెట్ జనసేనకు కేటాయింపు
- పిఠాపురం నుంచి తానే బరిలో దిగుతున్నట్టు పవన్ ప్రకటన
- తీవ్ర నిరాశకు గురైన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు కావడంతో, పలు స్థానాలను టీడీపీ తన మిత్రపక్షాలకు కేటాయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేయడానికి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. తాను ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు.
అయితే, పిఠాపురం టీడీపీ టికెట్ తనదే అని ఇప్పటివరకు ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు పవన్ ప్రకటనతో హతాశులయ్యారు. ఇది అన్యాయం అని వర్మ ఆక్రోశించారు.
"ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగం అయ్యాను. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేశాను. ఇన్ని చేసిన నాకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం" అని ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ చేశారు.