ప్రత్తిపాటి శరత్ కు బెయిల్ మంజూరు
- పన్ను ఎగవేత కేసులో ప్రత్తిపాటి శరత్ అరెస్ట్
- రిమాండ్ లో ఉన్న వైనం
- నేడు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు వెలువరించిన విజయవాడ కోర్టు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు ఊరట లభించింది. పన్ను ఎగవేత అంశంలో మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రత్తిపాటి శరత్ కు నేడు బెయిల్ లభించింది. విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు శరత్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ ఇచ్చారు.
జీఎస్టీ ఎగవేత, నకిలీ ఇన్ వాయిస్ లతో నిధులు మళ్లించారన్న అభియోగాలతో ఇటీవల విజయవాడ మాచవరం పోలీసులు ప్రత్తిపాటి శరత్ ను అరెస్ట్ చేశారు. శరత్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించగా, పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, శరత్ ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఈ పిటిషన్ ను నిన్న హైకోర్టు కొట్టివేసింది.