నాకు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి డబ్బు పోటీ పెట్టారు: కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

  • వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
  • నేడు టీడీపీలో చేరిక
  • ఎమ్మిగనూరు టికెట్ కు వైసీపీలో రూ.10 కోట్లు అడిగారని ఆరోపణలు
  • నా వద్ద అంత డబ్బు లేదని తప్పుకున్నానని వెల్లడి
వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 

ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు. 

అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు. 

బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.


More Telugu News