జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల్లో టార్చిలైటు గుర్తు కేటాయింపు
- జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న లక్ష్మీనారాయణ
- విశాఖ పార్లమెంటు స్థానం నుంచి లక్ష్మీనారాయణ పోటీ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైటు గుర్తు కేటాయించింది.
జై భారత్ నేషనల్ పార్టీ కొన్ని నెలల కిందటే పురుడు పోసుకుంది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాక లక్ష్మీనారాయణ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. తొలుత జనసేన పార్టీలో చేరి విశాఖ లోక్ సభ బరిలో పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి, రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాక, మద్దతుదారులతో కలిసి జై భారత్ నేషనల్ పార్టీ ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నారు.