జగన్నాథగట్టులో 'నేషనల్ లా యూనివర్సిటీ' పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • రాయలసీమలో సీఎం జగన్ పర్యటన
  • కర్నూలు జిల్లాలో లా యూనివర్సిటీకి భూమిపూజ
  • 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో లా వర్సిటీ నిర్మాణం
సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు విచ్చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టులో జాతీయ లా యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లా యూనివర్సిటీ పైలాన్ ను కూడ ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఈ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయ నిర్మాణం చేపడుతున్నారు. 

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు మంత్రి బుగ్గన, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


More Telugu News