చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన, దగా గుర్తొస్తాయి: సీఏం జగన్
- ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని చంద్రబాబు తీసుకురాలేదంటూ ముఖ్యమంత్రి ధ్వజం
- చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదంటూ మండిపాటు
- దత్తపుత్రుడి పేరు చెబితే.. వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడంటూ ఎద్దేవా
- పవన్ ఓ మ్యారేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు
- ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవన్న సీఏం జగన్
- వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారని విమర్శ
నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. ఒక్క గుర్తుండిపోయే పథకాన్ని బాబు తీసుకురాలేదని సీఏం జగన్ విమర్శించారు.
ఇక దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడని, ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ అని జనసేనానిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు. ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారని జగన్ అన్నారు. ఇది ముమ్మాటికీ మీ బిడ్డ మీదకు కాదు.. పేదవాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారని పేర్కొన్నారు.
2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన మందుకు వచ్చారని ఈ సందర్భంగా సీఏం జగన్ గుర్తు చేశారు. ఇదే పవన్ బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు.