రోహిత్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇచ్చి.. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేస్తే బాగుంటుంది: యువరాజ్ సింగ్
- వారం రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం
- రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం ముంబై చాలా పెద్ద నిర్ణయమన్న యువీ
- హిట్‌మ్యాన్‌ను మరో సీజన్ సారథిగా కొనసాగిస్తే మంచిదన్న భారత మాజీ క్రికెటర్
- ఫ్రాంచైజీ భవిష్యత్ దృష్ట్యా ముంబై పెద్ద నిర్ణయం తీసుకుందని వెల్లడి
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌లో పాల్గొనే జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాయి. ఇక ఈ ఏడాది దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో 10 జట్లు కొంతమంది కొత్త ప్లేయర్లను కూడా తీసుకున్నాయి. అయితే, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తీసుకున్న ఒక నిర్ణయం సంచలనంగా మారింది. అదే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడం. దీనిపై క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరిచారు. అయితే, ముంబై యాజమాన్యం మాత్రం జట్టు భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇదిలాఉంటే.. ముంబై నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడారు. రోహిత్ శర్మను సారథిగా తొలగించడం అనేది ముంబై తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం అని పేర్కొన్నాడు. అయితే, ఇంకా ఒక సీజన్ రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించి, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందన్నాడు.
ఇంకా యువీ మాట్లాడుతూ.. "ముంబైకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్ అందించాడు. అలాంటి సారథిని ముంబై యాజమాన్యం తొలగించడం నిజంగా చాలా పెద్ద నిర్ణయం. హిట్‌మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్‌గా నియమించింది. కానీ, నా అభిప్రాయం ప్రకారం రోహిత్‌కు మరో సీజన్ సారథిగా కొనసాగిస్తే బాగుంటుంది. అతనికి డిప్యూటీగా పాండ్యాను నియమించాలి. ఆ తర్వాత జట్టు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.
"ముంబై నిర్ణయాన్ని అర్థం చేసుకోగలను. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ప్రస్తుతం రోహిత్.. టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అలాగే చాలా మంచిగా కూడా ఆడుతున్నాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత్ అతని కెప్టెన్సీలోనే బరిలోకి దిగనుంది. ఈ విషయాలను ముంబై ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది" అని యువీ తెలిపాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యాకు కూడా చాలా నైపుణ్యం ఉందన్నాడు. గుజరాత్‌ను తన కెప్టెన్సీలోనే రెండుసార్లు ఫైనల్‌కు చేర్చి, ఒకసారి టైటిల్ కూడా అందించాడని యువరాజ్ గుర్తు చేశాడు. కానీ, ఐదుసార్లు ఛాంపియన్ అయినా ముంబైను నడిపించడం పాండ్యాకు అంత ఈజీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.