నేడు టీడీపీ రెండో జాబితా విడుదల.. చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ!
- తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
- రెండో జాబితాలో 25 మందిని ప్రకటించే అవకాశం
- చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు చెప్పిన చంద్రబాబు
ఇప్పటికే టీడీపీ 94 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు. దాదాపు 25 మంది అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో పలువురు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీ 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. స్పష్టత వచ్చిన స్థానాలను ఈరోజు చంద్రబాబు ప్రకటించనున్నారు.
మరోవైపు, రెండో జాబితా విడుదల నేపథ్యంలో, చంద్రబాబును మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న సాయంత్రం కలిశారు. ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంటాకు చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న మరోసారి చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. టికెట్ ఆశిస్తున్న పలువురు కడప జిల్లా నేతలు కూడా చంద్రబాబును కలిశారు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జీలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూపేశ్ రెడ్డి, బద్వేల్ నేత రితీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి పి.నారాయణ కూడా చంద్రబాబును కలిశారు. అయితే, తొలి జాబితాలోనే నారాయణ పేరును చంద్రబాబు ప్రకటించారు.