ఇది తెలుగు సినిమా... ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు ఈ సినిమా గురించి మాట్లాడాలి: విష్వక్సేన్
- గామి చిత్రంతో హిట్ కొట్టిన విష్వక్సేన్
- ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న చిత్రం
- విష్వక్సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చిత్రం
విలక్షణమైన కథాంశంతో యువ నటుడు విష్వక్సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన గామి చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా గురించి ఓ ప్రెస్ మీట్ లో విష్వక్సేన్ మాట్లాడుతూ, ఇది తెలుగు సినిమా అని, ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు ఈ సినిమాను చూడాలని, వారు ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరారు. తద్వారా సినిమాకు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగులో ఇలాంటి కథతో ఇప్పటివరకు సినిమాలు రాలేదని గర్వంగా చెప్పగలనని విష్వక్సేన్ అన్నారు. మరో 20 ఏళ్ల తర్వాత కూడా తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా గామి అని పేర్కొన్నారు. తానేమీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడడంలేదని, సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
మేం ఏ ఉద్దేశంతో ఈ సినిమా చేశామో అందరూ అర్థం చేసుకోవాలని విష్వక్సేన్ విజ్ఞప్తి చేశారు. గామి చిత్రం ఎందుకు ఇంతమందికి నచ్చిందో ఓసారి ఆలోచించాలని అన్నారు. కొందరు ఈ సినిమా అర్థం కావడంలేదని అంటున్నారని, అలాంటి వాళ్లు కొంచెం శ్రద్ధగా సినిమా చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వచ్చిన గామి చిత్రంలో విష్వక్సేన్ ఓ అఘోరా పాత్ర పోషించారు. డాక్టర్ జాహ్మవిగా చాందిని చౌదరి కీలకపాత్ర పోషించారు.