పాఠశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • పాఠశాల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తూ జీవో జారీ
  • పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వేయాలన్న ప్రభుత్వం
  • అన్ని బాధ్యతలను ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చూసుకోవాలని వెల్లడి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు (SHG) అప్పగిస్తూ బుధవారం జీవోను జారీ చేసింది. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని అందులో పేర్కొంది. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే... అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడం, నిర్వహణ, విద్యార్థులకు పాఠశాలల యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటివి అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తాయి.


More Telugu News