బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించిన కేసీఆర్
- చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును ప్రకటించిన బీఆర్ఎస్
- తొలి జాబితాలో నలుగురు పేర్లు ప్రకటించిన కేసీఆర్
- మొత్తం ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఆయా పార్టీలు వరుసగా ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ బుధవారం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేర్లను ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం వరంగల్ లోక్ సభ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధినేతకు కట్టబెడుతూ నేతలు నిర్ణయించారు.
వరంగల్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. అంతకుముందు 2015 ఉప ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పేర్లను ఇదివరకే ఖరారు చేశారు.