మోదీకే ఓటు.. 'న్యూస్18' మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో మెజారిటీ ఓటర్ల అబిప్రాయం!
- తదుపరి ప్రధానిగా మోదీయే బెస్ట్ అని 59 శాతం మంది వెల్లడి
- రాహుల్ గాంధీకి 21 శాతం, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌లకు 9 శాతం మంది చొప్పున మద్దతు
- నిజాయతీపరుడైన నేతగా ప్రధాని మోదీనే గుర్తిస్తామని సర్వేలో వెల్లడి
తాము ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తామని దేశంలోని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడినట్లు న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. బుధవారం సాయంత్రం న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వివరాలను వెల్లడించింది. తదుపరి ప్రధానిగా ఎవరు బెస్ట్? అన్న ప్రశ్నకు 59 శాతం మంది నరేంద్ర మోదీ పేరును సూచించారు. 21 శాతం మంది రాహుల్ గాంధీకి, 9 శాతం మంది మమతా బెనర్జీకి, 9 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేశారు.
నిజాయితీపరుడైన వ్యక్తిగా ఎవరిని గుర్తిస్తారు? అని అడిగితే 73 శాతం మంది మోదీని, 27 శాతం మంది రాహుల్ గాంధీ పేరును పేర్కొన్నారు. మోదీ హార్డ్ వర్క్ నాయకుడని 69 శాతం మంది అభిప్రాయపడగా... రాహుల్ గాంధీ పేరును కేవలం 31 శాతం మంది పేర్కొన్నారు. ప్రజల గురించే ఆలోచించే నేత కూడా మోదీయేనని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ బలమైన నాయకుడని 67 శాతం మంది చెప్పగా 33 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీ పేరు చెప్పారు. భారత భవిష్యత్తుపై సరైన ఆలోచన ఉన్న నేతగా మోదీకి 68 శాతం మంది ఓటు వేస్తే, రాహుల్ గాంధీకి 32 శాతం మంది ఓటేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 58 శాతం ఓట్ షేర్, ఇండియా కూటమికి 28 శాతం ఓట్ షేర్, ఇతరులకు 14 శాతం ఓట్ షేర్ రావొచ్చునని ఈ సర్వే విశ్లేషించింది. బీజేపీ - జేడీయూ కూటమి 38 సీట్లు, ఇండియా కూటమి 2 సీట్లు గెలుచుకోవచ్చునని తెలిపింది.
మెగా ఒపీనియన్ పోల్
న్యూస్18 నెట్‌వర్క్ తన మెగా ఒపీనియన్ పోల్ ఫలితాలను బుధవారం వెల్లడించింది. 21 రాష్ట్రాల్లోని 518 లోక్ సభ నియోజకవర్గాల్లో విస్తృత సర్వే నిర్వహించింది. ఈ పోల్ కోసం 1,18,616కు పైగా శాంపిల్స్ సేకరించారు. దాదాపు 95 శాతం లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేశారు. ఇది దేశంలోని అతిపెద్ద సర్వేలలో ఒకటిగా ఉంది. నేడు విడుదలైన ఈ సర్వే ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశీయ ఓటరు సెంటిమెంట్‌ను వెల్లడిస్తోంది.