ప్రణీత్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన డీఎస్పీ గంగాధర్
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో ప్రమోషన్ తెచ్చుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు
- మావోయిస్టు సంబంధిత ఆపరేషన్లలో పాల్గొనకుండానే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందారంటూ ఆరోపణ
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన డీఎస్పీ గంగాధర్
రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం వ్యవహారంలో సస్పెండ్ అయిన ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై డీఎస్పీ గంగాధర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రణీత్ రావు అడ్డదారిలో ప్రమోషన్ పొందారని అన్నారు. గత కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో దొడ్డిదారిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందిన నలుగురు అధికారుల్లో ప్రణీత్ కూడా ఉన్నారంటూ ప్రభుత్వానికి గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఈ అధికారుల ప్రమోషన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వం కావలసిన అధికారులకు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోషన్ ఇచ్చిందని డీఎస్పీ గంగాధర్ ఆరోపించారు. మావోయిస్టులతో ముడిపడిన ఆపరేషన్స్‌లో చురుకుగా వ్యవహరించిన అధికారులకు గతంలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ సంబంధిత ఆపరేషన్ చేయకుండానే డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు.