ఎన్నికల సభలకు లేని నొప్పి.. అసెంబ్లీకి రావడానికి ఎందుకో.. కేసీఆర్‌పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు..!
- బీఆర్ఎస్ కదనభేరి సభలో కాంగ్రెస్‌పై గులాబీ బాస్ విమర్శలు
- చట్టసభకు డుమ్మా కొడుతున్న కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలంటూ కాంగ్రెస్ ధ్వజం
- ఈసారి గెలిపిస్తే సభకు రాకుండా సల్లగా జారుకునేటందుకా? అంటూ నిలదీసిన కాంగ్రెస్
- దొరికిన కాడికి దోచుకోవడం ఫాంహౌస్‌లో దాయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదని చురకలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీకాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ పార్టీ సభలకు మాత్రం హాజరుకావడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మంగళవారం కరీంనగర్‌లో బీఆర్ఎస్ కదనభేరి సభకు హాజరైన కేసీఆర్.. కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు.
ఈ సభను ఉద్దేశించి బుధవారం టీకాంగ్రెస్ 'ఎక్స్' (గతంలో ట్విటర్) ద్వారా ఘాటుగా స్పందించింది. అసెంబ్లీకి రావాలంటే వచ్చే కాలు నొప్పి ఎన్నికల సభకు పోవడానికి లేదా? అంటూ ప్రశ్నించింది. చట్టసభకు రాకుండా ఉంటున్న మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? అంటూ నిలదీసింది. ఈసారి గెలిపిస్తే సభకు రాకుండా సల్లగా జారుకునేటందుకా? అని ప్రశ్నించింది.
గతంలో మీది దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని పాలన అనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని విమర్శలు గుప్పించింది. దొరికిన కాడికి దోచుకోవడం ఫాంహౌస్‌లో దాయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదని తెలిపింది. కాగా, కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ జరగడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే, అదే సమయంలో నల్గొండ, కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు హాజరుకావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.