బలపరీక్షలో నెగ్గిన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైనీ
- మూజువాణి ఓటుతో బలపరీక్షలో నెగ్గిన కొత్త ప్రభుత్వం
- మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో హర్యానాలో ఆసక్తికర పరిణామాలు
- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సైనీ
- నేడు బలపరీక్ష ఎదర్కొని... నెగ్గిన ముఖ్యమంత్రి
హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో హర్యానాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నాయబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొన్నారు.
జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. పార్టీ ఇచ్చిన విప్‌ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. కానీ విశ్వాస పరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంటపాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ కడియన్ డిమాండ్ చేశారు. బలపరీక్షపై సీక్రెట్ బ్యాలెట్ కావాలని డిమాండ్ చేశారు.