బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న అశ్విన్
- తాజాగా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
- మళ్లీ అగ్రపీఠం అధిష్ఠించిన టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్
- ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో 26 వికెట్లు తీసిన అశ్విన్
టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన అశ్విన్... టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకున్నాడు.
ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు అశ్విన్ కెరీర్ లో 100వ టెస్టు. ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తమ్మీద ఈ ఐదు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 26 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఇక, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా, హేజెల్ వుడ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా కగిసో రబాడా, ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, రవీంద్ర జడేజా, ప్రభాత్ జయసూర్య, జేమ్స్ ఆండర్సన్, షహీన్ అఫ్రిది ఉన్నారు.