ఉచిత హలీమ్ ఆఫర్.. హైదరాబాదీ హోటల్ ముందు రచ్చ రచ్చ!
- మలక్‌పేట్‌లోని ఓ హోటల్ ఇచ్చిన ఆఫర్‌తో భారీగా పోటెత్తిన కస్టమర్లు
- వినియోగదారులను నియంత్రించలేక చేతులెత్తేసిన నిర్వాహకులు, పోలీసులకు ఫిర్యాదు
- కస్టమర్లను నియంత్రించేందుకు బాటన్ చార్జ్ చేసిన పోలీసులు, పలువురికి గాయాలు
- ఉచిత హలీమ్ ఆఫర్‌తో న్యూసెన్స్ సృష్టించిన నేరం కింద హోటల్‌పై కేసు
రంజాన్ తొలి రోజున ఉచిత హలీమ్ ఆఫర్‌ను ప్రకటించిన ఓ హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్లు పోటెత్తడంతో అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కస్టమర్లను కంట్రోల్ చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారీ మండీ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. దీంతో, ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో, స్థానికంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి.
కాగా, ఉచిత ఆఫర్‌కు సంబంధించి హోటల్ యాజమాన్యం తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జాంకు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.